మొహమాటం వద్దు

జీవన వికాసం

Internship-Apprenticeship
Internship-Apprenticeship

ఇంటర్న్ షిప్ , అప్రెంటీస్ షిప్,… చదువుకుంటూనే సంస్థల తీరును తెలుసుకోగల మార్గాలు, వీటిని రెస్యూమ్ కు వెయిటేజీని ఇచ్చే మార్గాలుగానే భావించొద్దు. ఎందుకంటే ఇవి కెరీర్ ను నిర్మించుకునే మార్గాలు కూడా…

సంస్థను కళాశాలగానే భావించొద్దు.. వెళ్లి కూర్చుటే చాలు.. నేర్పుతారన్న భావన వద్దు.. తెలియని విషయం ఏదైనా వెళ్లి తెలుసుకోండి.. అమ్మాయిలు, ఏమంకుంటారనో వెనుకాడొద్దు.. ఇచ్చిన పనిని ఉత్సాహంగా సమయానికి పూర్తి చేయండి.. మొత్తంగా ఉద్యోగంలానే భావించండి.. చాలామంది వీటిని సెలవుల్లోనే ఎంచుకుంటారు..

కళాశాలకు వెళుతూనే చేస్తుంటే ఆ వివరాలను సంస్థకు తెలియజేయండి.. నేర్చుకోవాలన్న ఆరాటంలో చదువును నిర్లక్ష్యం చేయొద్దు.. రెంటినీ సమన్వయం చేసుకోవాలి…
నిపుణుల , అనుభవజ్ఞులతో పనిచేసి అవకాశం ఇంటర్న్ షిప్ , అప్రెంటిస్ షిప్ లతో దొరుకుతుంది.. వాళ్లతో పరిచయం పెంచుకోండి.. అలాగని వాళ్ళ సమయాన్ని వృధా చేయొద్దు.. వాళ్ళ పని హోదా మొదలైనవి తెలుసుకోండి.. తర్వాత కన్పించినపుడు పలకరించినా సరిపోతుంది.. కావాలంటే కెరీర్ పరమైన సందేహాలనూ అడగొచ్చు..

ఇక్కడ మీ ఉద్దేశ్యం నేర్చుకోవటమే. కాబట్టి తెలియదు అనటానికి సందేహించొద్దు.. అర్ధం కానీ విషయాలను ప్రశ్నించండి.. పైగా ఇది ఎదుటివారికి మీ ఆసక్తి తెలియజేస్తుంది.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/