4 నిముషాల్లో 51మంది గొంతుల అనుకరణ

జీవన వైవిధ్యం

మిమిక్రీలో చాలావరకు పురుషుల గొంతులే వినిపిస్తాయి. మహిళలూ ఆ అనుకరణను అవలీలగా చేస్తారు.. అని అఖిల ఎఎస్‌ అనే అమ్మాయి నిరూపిస్తోంది. నాలుగు నిమిషాల్లో యాభై ఒక్కమంది సెలబ్రీటీలను అనుకరించి చూపించింది!

‘ఈ నగరానికి ఏవైంది? ఓ వైపు దుమ్ము.. ఒక వైపు పొగ.. అంటూ యాంటీ స్మోక్‌యాడ్‌లో వినిపించే బ్యాక్‌గ్రౌండ్‌ వాయిస్‌ను అనుకరిస్తోంది ఓ ఇరవై ఏళ్ల అమ్మాయి తన తరగతి గదిలో, అచ్చంగా యాడ్‌లోని పురుషుడి గొంతుతోనే మాట్లాడుతున్న ఆ మాటలకు క్లాస్‌ అంతా ఈలలు, చప్పట్లతో మారుమోగిపో తోంది. వన్స్‌ మోర్‌ అంటున్నారు క్లాస్‌మేట్స్‌. అల గోపన్‌ నాయర్‌ (మలయాళం వాయిస్‌ ఆర్టిస్ట్‌, ఈ నగరానికి ఏమైంది అనే యాడ్‌కు మలయాళంలో వాయిస్‌ ఇచ్చింది అతనే) నుంచి మలయాళ నటీమణులు పార్వతి, నజిరియా నాజిమ్‌, కేరళ రాజకీయ నాయకులు ఇలా ఒకరి తర్వాత ఒకరిని అనుకరిస్తూనే ఉంది. ఆ అమ్మాయి పేరు ఏఎస్‌ అఖిల. ఆయుర్వేద వైద్యవిద్యను అభ్యసిస్తోంది. ఈ మేడా దితో చదువు పూర్తయిపోయి డాక్టర్‌ పట్టా పుచ్చుకోనుంది. ఆమె చేసే మిమిక్రీ సీన్స్‌ ఆ కాలేజ్‌లో చేసిందే.

మిమిక్రీ అఖిల :
అఖిల మలయాళ అమ్మాయి అని ఈపాటికే అర్థమయ్యుంటుంది. పుట్టింది, పెరిగింది తరువనంతపురం జిల్లాలోని నేడుమంగడ్‌లో. చిన్నప్పటి నుంచి చుట్టూ ఉన్న పరిసరాలను, మనుషులను పరిశీలించడం అలవాటు ఆమెకు, ఆ పరిశీలనలోంచే ఈ మమిక్రీ కళ అబ్బింది, అవడింది. స్కూల్లో ఉన్నప్పుడే క్లాస్‌లో తన కళను ప్రదర్శించేది. క్లాస్‌ టీచర్స్‌ను, క్లాస్‌మేట్స్‌ను అనుకరిస్తూండేది. ఒకసారి ఇలాగే క్లాస్‌లో డెమో ఇస్తూండగా టీచర్స్‌కు పట్టుబడింది ఫలితం.. స్కూల్‌లో ఆమె కళాప్రదర్శన. దాంతో అఖిలకు స్టేజ్‌ఫియర్‌ పోయి దైర్యం వచ్చింది. ఎక్కడైనా ప్రదర్శనలు ఇవ్వగలననే ఆత్మ విశ్వాసమూ పెరిగింది. అప్పటినుంచి తిరువనం తపురం జిల్లాలోని ప్రతి ఇంటర్‌స్కూల్‌ కంపిటీషన్‌లో పాల్గొనడం మొదలుపెట్టింది. ఎక్కడ గొంతు సవరిస్తే అక్కడ ప్రైజులు వచ్చిపడేవి. ఆ కళను తనతోపాటే పెంచి పెద్దచేసుకుంది. అయితే ఎక్కడా దానికి సంబంధించి శిక్షణ తీసుకోకుండానే, టివి, పరిశీలన ఇవే ఆమె ధ్వన్యనుకరణ నైపుణ్యాన్ని పెంచిన గురువులు.

ఎవరెవరిని అనుకరిస్తుంది :
ఎవరిని కాదు అని అడగొచ్చు. రజీనీకాంత్‌, కమల్‌హసన్‌, అద్నస్‌ సమీ, ఎస్‌.జానికి, ఓమెన్‌ చాందీ, విఎస్‌ అచుతానందన్‌, షాలినీ, షామిలీ (చిన్నప్పటి వాయిస్‌లను).. ఇలా చెప్పుకుంటూ పోతే
వందకుపైనే తేలొచ్చేమో జాబితా.
ఈ వీడియో వైరల్‌. : ఒక మలయాళం చానెల్‌లోని ఓ ప్రోగ్రామ్‌లో అఖిల చేసిన మిమిక్రీ కళలో మహిళా సూపర్‌స్టార్‌ అనే పేరు తెచ్చేసుకుంది అఖిల ఈషోతో. ఇప్పటివరకు మలయాళంలో ఎందరో మిమిక్రీ కళాకారులు వచ్చినా.. తర్తా తర్వాత వాళ్లంతా సినిమా ఆర్టిస్టులుగా స్థిరపడ్డారు. కాని ఆఖిల అలా కాకుండా మిమిక్రీ కళాకారిణిగానే కొనసాగాలనుకుంటోందట.
ఈ నగరానికి ఏవైంది : ‘ఈ నగరానికి ఏమైంది మలయాళం యాడ్‌కు గళమిచ్చిన గోపన్‌ నాయర్‌ను అనుకరిస్తూ ఓ వీడియో కూడా చేసింది అఖిల.
ఆ వీడియోకు మైఖేల్‌జాక్సన్‌ ‘డేంజరస్‌ పాట మ్యూజిక్‌ను జతకూర్చి ఒక కొత్త ప్రయోగానికి రూపమిచ్చింది.

అన్నట్టు అఖిల.. కేరళకు చెందిన తొలి ‘లేడీస్‌ ఓన్లీ మిమిక్స్‌ పరేడ్‌ గ్రూప్‌లో సభ్యురాలు కూడా. మీ లక్ష్యం ఏంటి అని అడిగితే ‘ఇలాగే ముగ్గురిని అనుకరిస్తూ ముప్పైమందిని నవ్వించడమే అంటుంది నవ్వుతూ అఖిల ఎస్‌. ‘చిన్నప్పటినుంచీ పక్షుల కిలకిలారావాలు, జంతువుల అరుపులను బాగా అబ్జర్వ్‌ చేసేదాని, నేను ఫస్ట్‌ మిమ్కిఈ చేసింది కూడా పక్షుల కూతలనే. తర్వాత ఇంట్లోవాళ్లను, ఫ్రెండ్స్‌ని, టీచర్స్‌ని అనుకరించేదాన్ని.
నిజానికి మా ఇంట్లో ఎవరికీ ఈ కళ లేదు. కేవలం పరిశీలనతో నా అంతట
నేను నేర్చుకున్నదే. సెలబ్రిటీల విషయానికి వస్తే నేను ఎస్‌.జానకమ్మను
ముందు ఇమిటేట్‌ చేశా. టివి బాగా చూస్తాను. నా స్కిల్‌ను పెంచి
నాకు కచ్చితత్వాన్ని ఇస్తున్న సాధనం అదే.

తాజా అంతర్జాతీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/