సొంత వైద్యాలు అనుసరణీయం కాదు

మనస్విని: వ్యక్తిగత సమస్యలకు పరిష్కార వేదిక

Knee pains
Knee pains

మేడమ్‌! నా వయసు 55 సంవత్సరాలు. నాకు ఇద్దరు పిల్లలు. పెళ్లిళ్లు అయిపోయాయి. అంతా బాగానే ఉంది. కానీ ఈ మధ్యనే నాకు మోకాళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు మొదలయ్యాయి.

కొంచెం ఒంటరిగా దిగులుగా అనిపిస్తోంది. ఇంకా జబ్బులు ఎక్కువవుతాయని భయంభయంగా ఉంది. నేను మరల ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? – ఉమాదేవి

మీరు తప్పక సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అవుతారు. ఆందోళన చెందనవసరం లేదు. ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. మంచిగా విశ్రాంతిగా ఉండాలి.

రోజుకు 8 గంటల నిద్ర అవసరం. ప్రశాంతంగా ఉండాలి. సంతృప్తిగా ఉండాలి. నొప్పులున్నప్పుడు పని చేయవద్దు.

శరీరానికి తగు విశ్రాంతినిస్తే, నొప్పులు తగ్గిపోతాయి. చాలా నొప్పిగా ఉంటే, వైద్యుల సలహాలు స్వీకరించండి. సొంత వైద్యాలు అనుసరణీయం కాదు నొప్పి ఎక్కువయినప్పుడు.

నొప్పి కూడా మంచిదే. నొప్పి ఉన్నప్పుడే మ నం మంచి వైద్యాన్ని స్వీకరిస్తాము.

అన్నింటికంటె ముఖ్యం ఆనందంగా ఉండటం. దైనందిన జీవితం ఉత్సాహంగా, ఆనందంగా మలచుకోవాలి. గతం గురించి దిగులువద్దు.

భవిష్యత్‌ గురించి ఆందోళన వద్దు. వర్తమానంలో సంతృప్తిగా ఆనందంగా ఉండాలి. ప్రతినిత్యం విలువైంది. జీవితం అమూల్యమైనది. సమస్య అవే పోతాయి. వాటి గురించి చింతించవద్దు.

అన్నీ సంతృప్తిగా ఉంటే, సమస్యలు కూడా తేలిగ్గా పరిష్కారం చేసుకోగలుగుతారు. కనీస అవసరాలు చాలా కనిష్టంగా ఉంటాయి.

అందువల్ల వాటి గురించి ఆందోళన అనవసరం. మంచి ఆహారం, మంచి విశ్రాంతి, మంచి ఆలోచనలతో, మంచి భావనలతో, ఆరోగ్యం బావ్ఞంటుంది. శారీరకంగా, మానసికంగా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి.

అవగాహనతో నిర్ణయాలు తీసుకోవాలి

మేడమ్‌! మాది మధ్య తరగతి కుటుంబం. మాకు ఇద్దరు అమ్మాయిలు. చదువ్ఞకుంటున్నారు. డిగ్రీలో ఉన్నారు. మా కుటుంబాలలో కట్నాలు ఎక్కువగా ఉంటాయి.

పెళ్లిళ్లు ఎలా చెయ్యాలా అని ఎంతో చింతంగా ఉంది.

చాలా ఖర్చులు అవుతాయి. కట్నకానుకలకు చాలా ఖర్చు అవుతాయి. ఈ విషయాల గురించి ఆలోచించి చాలా కుంగుబాటుకు లోనవుతున్నాను.

నా ఈ సమస్యల నుండి ఎలా బయటపడాలి? – కమలమ్మ

మీరు తప్పక ఈ మీ సమస్యల నుండి బయటపడగలరు. ఆందోళన వద్దు. మీరు ముందుగా మీ సామర్ధ్యాలను, బలాలను, వనరులను గుర్తించాలి.

మీలో ఎన్నో శక్తులు దాగి ఉన్నాయి. ఏ సమస్యనైనా ఎదుర్కోగల శక్తి మీ దగ్గర ఉన్నది.

అందువల్ల మీరు మీ సమస్యల గురించి ఆందోళన చెందవద్దు. భయపడవద్దు. జీవితాన్ని గురించి సానుకూలంగా ఆలోచించాలి. జీవితాన్ని ఆనందంగా స్వీకరించాలి.

ఆత్మ విశ్వాసంతో ఆత్మస్థయిర్యంతో ఆనందంగా గడపాలి. ఇది తప్పనిసరి. మీ అమ్మాయిల పెళ్లిళ్లు సులువుగా అయిపోతాయి.

స్పష్టతతో, అవగాహనతో నిర్ణయాలు తీసుకోవాలి. అనవసర ఖర్చులు మానుకోవాలి.
కట్నాలు ఇవ్వనవసరం లేదు.

హంగులు, ఆర్భాటాలు అనవసరం. ఎవరో ఏదో అంటారని భయపడవద్దు.

మీ జీవితం మీకు ముఖ్యం. మీకున్న వనరులను గుర్తించి ఆనందించాలి. మెచ్చుకోవాలి. అమూల్యమైన సమయాన్ని వృథా ఆలోచనలతో పాడు చేసుకోకూడదు.

అన్నింటికీ మించి పరిపూర్ణంగా జీవితాన్ని ఆస్వాదించాలి. ఉత్సాహంగా, ఉల్లాసంగా జీవితాన్ని రంగుల మయంగా చేసుకోవాలి. ఇది తప్పక చేయవలసిందే.

  • డాక్టర్‌ ఎం. శారద, సైకాలజీ ప్రొఫెసర్‌

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/