రేపు ఢిల్లీకి వెళ్లనున్న సిఎం జగన్

రాష్ట్ర పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై ప్రధాని మోడితో చర్చించనున్న జగన్

AP CM YS Jagan
AP CM YS Jagan

అమరావతిః సిఎం జగన్‌ రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నారు. ఎల్లుండి ప్రధాని మోడీతో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను మోడీతో చర్చించనున్నారు. విభజన హామీలను అమలు చేయాలని మరోసారి కోరనున్నారు. రాజకీయ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్న నేపథ్యంలో మోడీతో జగన్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

ఇంకోవైపు పలువురు కేంద్ర మంత్రులను కూడా జగన్ కలవనున్నారు. కేంద్ర మంత్రులకు సంబంధించి కొందరి అపాయింట్ మెంట్లు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఈ నెల మొదటి వారంలో మోడీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు అఖిలపక్ష సమావేశానికి కూడా జగన్ హాజరయ్యారు. ఇటీవల మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కూడా పాల్గొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/news/national/