దేశంలో కొత్తగా 5,326 క‌రోనా కేసులు

మృతుల సంఖ్య మొత్తం 4,78,007

న్యూఢిల్లీ: దేశంలో నిన్న 5,326 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న క‌రోనా నుంచి 8,043 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. క‌రోనాతో నిన్న 453 మంది ప్రాణాలు కోల్పోయారని వివ‌రించింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 79,097 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది.

ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,41,95,060 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 4,78,007కు పెరిగింద‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,38,34,78,181 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/