బాసర పుణ్యక్షేత్రంలో ఆన్‌లైన్‌ పూజలు ప్రారంభం

మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలంటున్న ఆలయ అధికారులు

basara temple
basara temple

నిర్మల్‌: లాక్‌డౌన్‌ కారణంగా దేశంలోని ఆలయాలలో కొద్ది రోజులపాటు దైవ దర్శనాలను నిలిపివేశారు. కాని దేవతా మూర్తులకు మాత్రం నిత్య పూజలు కొనసాగిస్తున్నారు. కొన్ని దేవాలయాల్లో భక్తుల కోసం ఆన్‌లైన్‌ పూజలను అందుబాటులోకి తీసుకువచ్చారు. తాజాగా బాసర సరస్వతీ అమ్మవారి క్షేత్రంలో కూడా ఆన్‌లైన్‌ పూజలు ప్రారంభించినట్లు ఆలయ అధికారలు తెలిపారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అమ్మవారికి ఆన్‌లైన్‌లో పూజలు కల్పించుకునే వెసులుబాటును ఆలయ అధికారలు కల్పించారు. మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఈ అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకం, చండీ హోమం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/