తుపాకీ పేల్చడంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండించిన మంత్రి శ్రీనివాస్

నిన్నటి నుండి మీడియా లో టిఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేరు వైరల్ గా మారింది. వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీనివాస్ గౌడ్ ర్యాలీ లో పాల్గొన్నారు. కాగా ర్యాలీలో జనం మధ్య ఆయన తుపాకీతో కాల్పులు జరపడం ఇప్పుడు వివాదంలోకి నెట్టాయి. పోలీసుల చేతుల్లోని తుపాకీని తీసుకుని ఆయన గాల్లోకి కాల్పులు జరిపిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవ్వడం.. మరోవైపు అధికారులు సైతం ఆయన్ని అడ్డుకోలేదనే విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. బిజెపి నేతలు శ్రీనివాస్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..రాజీనామా చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో మంత్రి శ్రీనివాస్ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. తుపాకీ పేల్చితే.. రాజీనామా చేయాలా అని ప్రశ్నించారు. ఏదైనా ఘటన జరిగితే.. విచారణ అంటూ ఉంటుందని .. దాని ప్రకారం నడుచుకోవాలన్నారు. తాను పేల్చింది రబ్బరు బుల్లెట్ అని మరోసారి మంత్రి శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. తాను పదేపదే చెబుతున్నా.. ప్రతిపక్షాలు కక్కుర్తి రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు.