గత 24 గంటల్లో భారత్‌లో 195 మంది మృతి

దేశంలో గత 24 గంటల్లో 3,900 మందికి కొత్తగా కరోనా

corona-india
corona-india

న్యూఢిల్లీ: దేశంలో కరోనా నియంత్రణకు చర్యలు కొనసాగుతున్న కూడా కరోనా కేసులు పెరుగుతునే ఉన్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో 195 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 1,568కి చేరింది. గత 24 గంటల్లో దేశంలో 3,900 మందికి కొత్తగా కరోనా సోకింది. ఈమేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 46,433కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 12,727 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 32,134 మంది చికిత్స పొందుతున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/