క‌ర్నూల్ జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం..ఇద్దరు మృతి

క‌ర్నూల్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మృతి చెందారు. ఈఘ‌ట‌న‌ ఓర్వకల్లు (మం) పూడి చేర్ల మెట్ట వద్ద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. హైదరాబాద్ కు చెందిన కార్తిక్ ట్రావెల్స్ బస్సు తిరుపతి నుండి హైదరాబాద్‌కు 28 ప్రయాణికులతో బయలుదేరింది. బస్సు పూడిచెర్ల మెట్ట వద్దకు రాగానే అతివేగం, నిద్రమత్తు వలన కల్వర్టును ఢీకొంది.

ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ శ్రీనివాసులు, ప్రయాణికుడు రాములు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు కల్వర్టును ఢీ కొట్టి అక్కడే నిలబడిపోవడం వలన భారీ ప్రమాదం తప్పింది. అలాగే మహారాష్ట్రలోని బీజాపుర్ గుహాగర్ జాతీయ రహదారిపై జంబుల్వాడి ప్రాంతంలో జరిగిన కారు, బస్సు ఢీకొన్న ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.