పొన్నం సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. రాముడిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఒక వేళ తాను అన్నట్లు బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనానికి సిద్ధం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాము రాముడిని ఆరాధిస్తామని.. కానీ రాజకీయాలు చేయం అన్నారు. తెలంగాణలో ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందన్నారు. కేసీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు. ట్యాపింగ్ పై కేటీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారని, ఫోన్ ట్యాపింగ్ పై విచారణ కొనసాగుతోందని తెలిపారు.