బీఆర్ఎస్ పార్టీకి భేతి సుభాష్ రెడ్డి గుడ్ బై

బిఆర్ఎస్ పార్టీకి ప్రతి రోజు వరుస షాకులు తగులుతున్నాయి. వరుసపెట్టి నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది పార్టీకి గుడ్ బై చెప్పగా..తాజాగా బీఆర్ఎస్ పార్టీని మ‌రో కీల‌క నేత వీడారు. భేతి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పారు.ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ కు పంపారు.

ఉప్పల్‌ అసెంబ్లీ టికెట్‌ తనకు కాకుండా మరో వ్యక్తికి ఇచ్చారనే నేపథ్యంలోనే ఆయన గత కొద్దీ రోజులుగా పార్టీ ఫై అసంతృప్తి తో ఉన్నారు. ఇక ఈరోజు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఇక లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ కు మద్దతు ఇస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. దీనిని బట్టి చుస్తే త్వరలోనే ఆయన బిజెపి లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది.