ఎండాకాలంలో ఆహారం పాడవకుండా..

వంటింటి చిట్కాలు

Food Storage in Summer
Food Storage in Summer

ఎండలు పెరుగుతున్నాయి… వేడికి త్వరగా ఆహారం పాడటం ఈ కాలంలో పెద్ద సమస్య… దీన్ని ఎలా అధిగమించ వచ్చో చూద్దాం..
వెల్లుల్లిలో యాంటీ వైరల్ గుణాలెక్కువ… వంటకాల్లో దీనికి ప్రాధాన్యత ఇవ్వండి… ఆహారం త్వరగా పాడవకుండా ఎక్కువ సేపు నిల్వ ఉండేలా కాపాడుతుంది… ఇది కడుపులోని బాక్టీరియా వంటి స్మూక్ష్మ క్రిములతోనూ పోరాడగలదు..

రుచికి ఉప్పు తప్పనిసరి.. ఈ కాలంలో మాత్రం పింక్ లేదా హిమాలయన్ సాల్ట్ ను వంటల్లో వాడండి… ఇవి సహజ నిల్వ పదార్ధాలుగా పనిచేస్తాయి..
సిట్రిక్ ఆసిడ్ కూడా సహజ నిల్వ పదార్థమే… ఇది నిమ్మ ద్వారా పుష్కలంగా లభిస్తుంది… చల్లవైనా, ఉడికించినవైనా కొద్దిగా నిమ్మ రసాన్ని కలపండి.. ఆహారం పాడవకుండా చూస్తుంది… లేదూ కాస్త వెనిగర్ కలపండి.. ఇది ఆహారాన్ని కుళ్ళుమ్పజేసే స్మూక్షజీవులను చంపడమే కాదు, రుచిని పెంచటంలోనూ సాయపడుతుంది..

తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/category/telangana/