మొబైల్‌ను వదలటం లేదా?!

పిల్లలు-సంరక్షణ

Girl with mobile
Girl with mobile

ఈ స్మార్ట్‌ యుగంలో చిన్నారులకు మొబైల్‌ ఫోన్లు పెద్ద కాలక్షేపం వస్తువులుగా మారాయి. మారాం చేస్తున్నారనో, పనికి అడ్డు తగులు తున్నారనో పెద్దవారు కూడా ఏముందిలే అని ఫోన్‌ను పిల్లల చేతికి ఇస్తున్నారు.

అరచేతిలోనే కావల్సినంత వినోదం ఉంటే ఇంక వారు దాన్ని ఎలా వదలగలుగుతారు. తెలసీ తెలియని వయసులో కనించినవన్నీ ‘టచ్‌ చేసుకొంటూ వెళ్లిపోతున్నారు. కాస్త ఎదిగిన పిల్లలైతే యు ట్యూబ్ వీడియోస్ చూస్తూ. గేమ్స్‌ ఆడుకొటూ గంటలకొద్దీ గడిపేస్తున్నారు. దీంతోనే
అసలు సమస్య మొదలవుతుంది. మరి దీనికి చెక్‌ పెట్టడం ఎలా?

  • క్రమంగా ఇండోర్‌ గేమ్స్‌ను అలవాటు చేయండి.
  • రోజూ పిల్లలతో కొంత సమయాన్ని గడపాలి. వారితో తప్పకుండా అడడం వ్యాకంగా మార్చుకోండి.
  • అన్నింటికన్నా ముందు ముబైల్‌ ఫోన్‌ వాడకాన్ని తగ్గించుకోండి. దానివల్ల మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకొంటారు.
  • మీకు అవసరం లేనప్పుడు వైపై. మొబైల్‌ డేటాలను ఆఫ్‌ చేయండి.
  • పిల్లలంటే ఎవరికీ ప్రేమ ఉం డదు. ఆ ప్రేమతో వారు అడగినా, అడగపోయినా మొబైల్‌ పాస్‌వర్డ్‌ ఇచ్చేస్తుంటాం. అది మంచి పద్ధతి కాదని గుర్తుంచుకోండి.
  • స్క్రీన్‌ డీఅడిక్షన్‌ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం తెచ్చుకోకుండా
    ముందు నుంచే పిల్లల్ని నియంత్రణలో పెట్టండి అది జరగా లంటే ముందు మీరు స్క్రీన్‌ సమయాన్ని తగ్గంచుకోవాలని మరిచిపోకండి.
  • చిన్నారులకు సాధ్యమైనత దూరంగా మొబైల్స్‌, ట్యాబ్స్‌ ఉండేలా ఒక నియంత్రణ పద్ధతిని అవలంభించండి. అంటే స్క్రీన్‌, యాప్‌ లాక్‌లవంటివి మీ డివైజ్‌లో యాక్టివేట్‌చేసు కోండి.
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘డబ్ల్యూహెచ్‌ఓ సూచనల ప్రకారం ఏదైళ్ల లోపు చిన్నారు లు రోజు మొత్తంలో గంటకు మించి గ్యాడ్జెట్స్‌ ఉపయోగించడం శ్రేయస్కరం కాదు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/