రోజా కు టికెట్ ఇస్తే మద్దతు ఇచ్చేదే లేదంటున్న 5 మండలాల వైసీపీ శ్రేణులు

Roja

మంత్రి రోజా కు టికెట్ ఇస్తే మద్దతు ఇచ్చేది లేదంటూ తేల్చి చెపుతున్నారు ZPTC వాడమాలపేట మురళిరెడ్డి. కక్ష సాధింపుతో అభివృద్ధి పనులను మంత్రి రోజా అడ్డుకుంటున్నారన్నారు. శిలాఫలకాలకు మంత్రి టైం స్పెండ్ చేస్తోంది..కానీ, అభివృద్ధికి మాత్రం సమయం కేటాయించదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 మండలాల్లో మంత్రి రోజా సోదరులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని..క్వారీలు, ఇసుక, ప్రభుత్వ భూముల దందాకు తెర లేపారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

మంత్రి రోజను గెలిపించినందుకు మాకు మంచి గుణపాఠం నేర్పిందని వాపోయారు. నియోజకవర్గం మొత్తం ఐదు మండలాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పుకొచ్చారు. మంత్రి రోజాకు టికెట్ ఇవ్వద్దని 5 మండలాల నాయకులం అధిష్టానంకు ఫిర్యాదు చేశామని కామెంట్స్ చేశారు. రోజాకు టికెట్ ఇస్తే టీడీపీ అభ్యర్థి భాను గెలుస్తాడని జోస్యం తెలిపారు.