అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణ స్వీకారం

127 ఏళ్ల నాటి బైబిల్‌పై ప్రమాణం

వాషింగ్టన్‌: అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. భార్య సమక్షంలో కుటుంబానికి చెందిన పురాతన బైబిల్‌ సాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. వాషింగ్టన్‌ డీసీలోని క్యాపిటల్‌లో జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనకు ముందు ఉపాధ్యాక్షురాలు కమలా హ్యారిస్‌ ప్రమాణం చేశారు. అలాగే, కమలా హారిస్‌తో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సోనియా సోటోమేయర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణం కోసం ఆమె రెండు బైబిళ్లను ఉపయోగించారు. అందులో ఒకటి స్నేహితురాలు రెజీనా షెల్టన్‌ది కాగా, రెండోది సుప్రీంకోర్టు తొలి ఆఫ్రికన్ అమెరికన్ న్యాయమూర్తి జస్టిస్ థర్‌గుడ్ మార్షల్‌ది.

బైడెన్ ప్రమాణ స్వీకారానికి వెయ్యిమంది మాత్రమే హాజరయ్యారు. మాజీ అధ్యక్షులైన బరాక్ ఒబామామిచెల్, బిల్ క్లింటన్హిల్లరీ, జార్జ్ డబ్ల్యూ బుష్లారా దంపతులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా అల్లర్లు చోటుచేసుకునే అవకాశం ఉందన్న సమాచారంతో క్యాపిటల్ హిల్ పరిసరాల్లో 25 వేల మందికిపైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. ముందు జాగ్రత్త చర్యగా భద్రతా సిబ్బందిలోని 12 మంది అనుమానితులను సేవల నుంచి తప్పించారు.

అయితే తాజా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రం బైడెన్‌ ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు. మరోవైపు ట్రంప్‌ వైఖరి, క్యాపిటల్‌పై ఆయన మద్దతుదారుల దాడి నేపథ్యంలో బైడెన్‌, కమలా ప్రమాణ స్వీకారానికి అమెరికా చరిత్రలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. లేడీ గగా జాతీయ గీతం ఆలపించగా , జెన్నిఫర్‌ లోపెజ్‌ తన పాటలతో అలరించారు.

Joe Biden, Kamala Harris Inauguration Day updates | Biden vows to defeat  'domestic terror, white supremacy' - The Hindu


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/