పెళ్లిపీటలు ఎక్కబోతున్న వరలక్ష్మి శరత్ కుమార్

ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్..పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. ఇటీవల సినీ తారలంతా వరుస పెట్టి ఓ ఇంటివారు అవుతున్నారు. ఈ క్రమంలో లేడీ డాన్ గా పేరు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఓ ఇంటిది కాబోతుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ముంబైకి చెందిన పెయింట్ ఆర్టిస్ట్ నికోలయ్ సచ్‌దేవ్ ని నేడు నిశ్చితార్థం చేసుకుంది. ఇరు ఫ్యామిలీలు ఈ వేడుకలో పాల్గొన్నాయి.

ఈ నిశ్చితార్థం ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఈ కొత్త జంటకు అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సంవత్సరమే వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. తెలుగులో క్రాక్, వీరసింహ రెడ్డి, నాంది.. లాంటి సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులని మెప్పించింది. సౌత్ లోని అన్ని భాషల్లో వరుస సినిమాలు చేస్తూ ఇప్పటికే 50 సినిమాలు పూర్తి చేసింది. రీసెంట్ గా హనుమాన్ మూవీలో వరలక్ష్మి నటించింది.