మార్చి 11న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారభించబోతున్న రేవంత్

మార్చి 11న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించనున్నది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇల్లు లేని అర్హులందరికీ పథకాన్ని వర్తింపజేయాలని.. అందుకు అనుగుణంగా వెంటనే విధివిధానాలను తయారు చేయాలని సూచించారు.

పథకంలో ఇంటి స్థలం ఉన్న వారికి నిర్మాణానికి రూ.5లక్షలు ఆర్థిక సాయం చేయనున్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5లక్షలు అందించనున్నారు. అందుకు సంబంధించిన నిబంధనలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులతో సీఎం సమీక్షించారు. సమావేశంలో సీఎంతో పాటు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.