ఉగాది ప్రాశస్త్యం

పండుగలు.. విశేషాలు

Ugadi Festival

ఉగాది ప్రాముఖ్యం: చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు.

మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా ‘ఉగాది ఆచరణలోకి వచ్చెనని పురాణప్రీతి.

బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు.

అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస, వర, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్ద ల భావన.

అంతే కాదు వసంత రుతువు కూడా అప్పుడు మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకొంటారు. శాలివాహనడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ప్రాశస్తశ్యంలోకి వచ్చిందని మరొక గాథ.

ఉగాది, యుగాది అనే రెండు పదాలు వా డుకలో ఉన్నాయి. ఉగ అనగా నక్షత్ర గమనం. నక్షగ్రమనానికి ఆది ఉగాది అంటే సృస్టి ఆరంభమైనదినమే ఉగాది.

యుగము అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము.

ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతము యుగమ కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది.

ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడి పడ్వాగానూ, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోనూ, సిక్కులు, వైశాకీగానూ బెంగాలీలు పోయి ల బైశాఖ్‌గానూ జరుపుకుంటారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/