నేటి సామాజిక సాధికార యాత్ర షెడ్యూల్

నాలుగున్నరేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్‌ చేసిన మేలును వివరించడానికి వైస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా జనం నీరాజనాలు పలుకుతున్నారు. ఇప్పటీకే మొదటి షెడ్యూల్ పూర్తి కాగా..రెండు రోజుల క్రితం రెండో దశను మొదలుపెట్టింది.

ఈరోజు శనివారం సామాజిక సాధికార యాత్ర విశాఖ జిల్లాలో విశాఖపట్నం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు, కర్నూలు జిల్లాలో పత్తికొండ నియోజకవర్గాల్లో జరగనుంది. ఈ యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణ పేదలకు చేసిన మేలును ఆ వర్గానికి చెందిన మంత్రులు, నేతలు ప్రజలకు వివరించనున్నారు.