బీజేపీలోకి కేజీఎఫ్ నటుడు..

అధికార పార్టీ బిజెపి లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు , సినీ ప్రముఖులు జాయిన్ కాగా..తాజాగా కేజీఎఫ్ ఫేమ్ , మాజీ మంత్రి అనంత్ నాగ్ ఈరోజు బిజెపి పార్టీలోకి చేరబోతున్నారు. ఈరోజు సాయంత్రం బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ సమక్షంలో అనంత్ నాగ్ క్షయం కండువా కప్పుకోబోతున్నారు.

గతంలో జె.హెచ్ పటేల్ హయంలో ఈయన పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో చామరాజ్‌పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీఎస్‌ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. అప్పటినుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్న అనంత్ నాగ్ మళ్లీ రాజకీయాల్లో యాక్టీవ్ అయ్యారు. అందులో భాగంగా బీజేపీలో చేరనున్నారు. 1973 నుంచి సినిమాల్లో నటిస్తున్న అనంత్ నాగ్ కన్నడ, తమిళ్, తెలుగు, మలయాళ బాషల్లో 196 సినిమాల్లో నటించారు. తెలుగు లో నితిన్ నటించిన భీష్మ మూవీ లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అలాగే కేజీఎఫ్ చిత్రంలో హీరో స్టోరీ చెప్పే పాత్రలో కనిపించారు.