ఎల్లుండి నుండి ఓటిటి లోకి ఉగ్రం..

అల్లరి నరేష్ నటించిన ఉగ్రం మూవీ ఓటిటి లో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. గత కొంతకాలంగా సరైన హిట్స్ లేని అల్లరి నరేష్ కు నాంది చిత్రం సూపర్ హిట్ అయ్యి..నరేష్ సినీ కెరియర్ కు ఊపిరి పోసిన సంగతి తెలిసిందే. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల డైరెక్షన్లో విడుదలైన ఈ మూవీ కమర్షియల్ గా మంచి విజయం సాధించి..నరేష్ లోని మరో కోణాన్ని బయటపెట్టింది. ఇదే డైరెక్టర్ డైరెక్షన్లో ఉగ్రం అనే మూవీ చేసాడు నరేష్.

క్రైమ్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ధి నిర్మించారు. మే 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ జూన్ 02 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. ఓటీటీలో ఈ సినిమా చూసేందుకు ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి థియేటర్స్ లలో పెద్దగా అలరించలేకపోయిన ఈ మూవీ ఓటిటి లో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.