రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రియాంక గాంధీ పర్యటన

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు కనపరుస్తుంది.అదిరిపోయే మేనిఫెస్టో లతో ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తూనే..వాటిని జనాల్లోకి తీసుకెళ్లడం లో సక్సెస్ అవుతున్నారు. గల్లీ నేతల నుండి ఢిల్లీ నేతల వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే రాహుల్ , డీకే , సోనియా , ఖర్గే మొదలగువారు ప్రచారం చేస్తూ వస్తున్నారు.

ఇక ప్రియాంక గాంధీ సైతం మరోసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రేపు ఏఐసీసీ ప్రియాంకగాంధీ రానున్నారు. ఆసిఫాబాద్, ఖానాపూర్ నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రియాంక గాంధీ, పీసీసీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రియాంకగాంధీ జిల్లా కేంద్రానికి రానున్నారని డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ ఎదుట నిర్వహించే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారని తెలిపారు.

ఇక నిన్న రాహుల్ రాష్ట్రంలో పర్యటించి కాంగ్రెస్ హామీలను ప్రజలు తెలుపుతూ..అధికార పార్టీ బిఆర్ఎస్ ఫై విమర్శల వర్షం కురిపించారు.