రాజ్య‌స‌భ సీటిచ్చినందుకు సీఎంకు కృత‌జ్ఞ‌త‌లు ..బీద మ‌స్తాన్ రావు

తాడేప‌ల్లి సీఎం క్యాంపు ఆఫీస్‌లో సీఎం జ‌గ‌న్‌తో బీద మ‌స్తాన్ రావు భేటీ

అమరావతి: మాజీ ఎమ్మెల్యే, వైస్సార్సీపీ నేత బీద మ‌స్తాన్ రావు ఈరోజు సీఎం జగన్ తో భేటీ అయ్యారు. త‌న‌కు రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ఇచ్చినందుకు ఆయ‌న సీఎంకు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఏపీ కోటాలో త్వ‌ర‌లో ఖాళీ కానున్న 4 రాజ్య‌స‌భ స్థానాల‌కు న‌లుగురు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేస్తూ వైస్సార్సీపీ రెండు రోజుల క్రిత‌మే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలోనే త‌న‌ను రాజ్య‌స‌భకు పంపేందుకు నిర్ణ‌యం తీసుకున్న జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపేందుకే మ‌స్తాన్ రావు గురువారం తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యానికి వ‌చ్చారు. టీడీపీతో రాజ‌కీయ జీవితాన్ని ప్రారంభించిన మ‌స్తాన్ రావు… 2019 ఎన్నిక‌ల త‌ర్వాత టీడీపీని వీడి వైస్సార్సీపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. పార్టీలో చేరిన అనతికాలంలోనే ఆయ‌న ఏకంగా రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాన్ని ద‌క్కించుకోవ‌డం గ‌మ‌నార్హం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/