ఢిల్లీకి బయలుదేరిన వైఎస్‌ఆర్‌సిపి ఎంపిలు

ysrcp
ysrcp

విజయవాడ: వైఎస్‌ఆర్‌సిపి ఎంపిలు : ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు. మధ్యాహ్నం 3 గంటలకు స్పీకర్‌ ఓంబిర్లాను కలవనున్నారు. వైఎస్‌ఆర్‌సిపి రెబల్‌ ఎంపి రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఎంపిలు లేఖ ఇవ్వనున్నారు. ఢిల్లీ బయలుదేరిన వారిలో విజయసాయిరెడ్డి, నందిగామ సురేష్‌, లావు కృష్ణదేవరాయలు, మార్గాని భరత్‌, మిథున్‌రెడ్డి, బాలశౌరి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులున్నారు. కాగా అనేక అంశాల నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సిపి అధినాయకత్వం రఘురామకృష్ణరాజుపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇప్పటికే ఆయనకు షోకాజ్ నోటీసులు కూడా పంపారు. 


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/