నాలుగు నెలల పాటు దీక్ష చేపట్టిన పవన్‌ ‌

ప్రజా సంక్షేమం కోరుతూ.. దీక్ష

pawan kalyan
pawan kalyan

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రజా సంక్షేమం కోరుతూ ..చాతుర్మాస దీక్షను ప్రారంభించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలు కాపాడబడాలని, తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే దిశగా, భగవంతుడిని ప్రార్థిస్తూ, నాలుగు నెలల పాటు దీక్షను చేయాలని పవన్ నిర్ణయించారు. ఈ నాలుగు నెలలూ ఆయన ఏకభుక్తంగానే ఉంటారు. అంటే ఒంటిపూట మాత్రమే భోజనం చేస్తారు. ఈ దీక్షను పూర్తి చేసే క్రమంలో నిత్యమూ నియమబద్ధ జీవితాన్ని గడపనున్నారు. కాగా, ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ చిత్రంలో నటిస్తున్న ఆయన, లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/