లేని ఇన్నర్ రింగ్ రోడ్ లో అవినీతా?

మతిలేని ప్రభుత్వం…బుద్ధిలేని ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలి – అచ్చెన్నాయుడు

Achennayudu released a book titled ‘How corruption happened in the inner ring road where there was no, no way’

అమరావతి: స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కేసులో చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపిన జగన్ సర్కార్, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ వ్యవహారాలకు సంబంధించి ఆయనపై కోర్టుల్లో మెమోలు దాఖలు చేసిందని ఏపీ టిడిపి అధ్యక్షుడు కె . అచ్చెన్నాయుడు అన్నారు. . ఒకదాని తర్వాత ఒకటిగా తప్పుడు కేసుల తో చంద్రబాబుపై జగన్ రెడ్డి కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జగన్ రెడ్డి రాజకీయ కుట్రలను తిప్పికొట్టడంలో భాగంగా టీడీపీ వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించిందని, . దానిలో భాగంగా నిన్న తెలుగుదేశం పార్టీ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కు సంబంధించిన వాస్తవాలతో ‘స్కిల్ పై నిందలు వేయడమంటే, యువత భవితపై దాడిచేయడమే’ అన్న పుస్తకాన్ని విడుదల చేశామన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారానికి సంబంధించిన వాస్తవాల సమాహారమైన ‘లేని, వేయని ఇన్నర్ రింగ్ రోడ్ లో అవినీతి ఎలా జరిగింది’ అన్నపేరుతో ఒక పుస్తకాన్ని విడుదల చేశామని తెలిపారు. . ఈ పుస్తకంలో రాజధాని అమరావతి అభివృద్ధికోసం గతంలో టీడీపీప్రభుత్వం నిర్మించాలనుకున్న ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారానికి సంబంధించిన పూర్తి సమాచారా న్ని పొందుపరచడం జరిగిందని. . ప్రజలు తెలుగుదేశం పార్టీ విడుదలచేసే పుస్తకాలను చదివి, వాస్తవాలు తెలుసుకొని అధికారపార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేస్తున్నామని కోరారు.

దేశానికే రోల్ మోడల్ గా నిలిచిన చంద్రబాబునాయుడిని తప్పుడుకేసులతో జైల్లో పెట్టి జగన్ రెడ్డి శునకానందం పొందుతున్నారని దుయ్యబట్టారు. తన ఆలోచనలు.. పనితీరుతో చంద్రబాబునాయుడు దేశం గర్వించేలా జాతీయ నాయకుడిగా ఎదిగారని చెబుతూ, ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం అనేక రాష్ట్రాలకు, వ్యవస్థలకు , వ్యక్తులకు రోల్ మోడల్ గా నిలిచిందనడం అతిశయోక్తి కాదన్నారు. . అలాంటి వ్యక్తిని ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి అన్యాయంగా జైల్లో పెట్టి పైశాచికానందం పొందుతున్నారని, స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ యువత జీవితాల్లో కొత్త వెలుగులు నింపిందే తప్ప.. ఎక్కడా వీసమెత్తు అవినీతికి దానిలో ఆస్కారం లేదని తాము తొలినుంచీ చెబుతూనే ఉన్నామన్నారు. . ఆ ప్రాజెక్ట్ ఏర్పాటు.. అమలులో, పైసా అవినీతి జరగలేదని ,రాష్ట్రయువత శక్తి యుక్తుల్ని, మేథా సంపత్తిని ప్రపంచవ్యాప్తంగా తెలియచేయడం కోసం ముందుచూపు తో చంద్రబాబునాయుడు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ను జగన్ రెడ్డి తన కక్షసాధింపులకోసం బలిచేశారని అన్నారు. టీడీపీ అధినేతను జైలుకు పంపి 30రోజులవుతున్నా… ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం ఇంతవరకు ఆయన తప్పుచేశాడని రుజువు చేయలేకపోయిందన్నారు. న్యాయ స్థానాల్లో ఒక్కటంటే ఒక్క ఆధారం ప్రవేశపెట్టలేకపోయిందని . ఒక్క రూపాయి అవినీతి జరిగినట్టు నిరూపించలేని ఈ దద్దమ్మలు చివరకు ఏమీ తేల్చలేని తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు ఇచ్చిన విరాళాలపై పడ్డారని అన్నారు.

తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/telangana/