బాలకృష్ణ కు వైస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వార్నింగ్

హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే , సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కు వైస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఓ వేడుకలో బాలకృష్ణ సాంగ్స్ ప్లే చేసారని , వైస్సార్సీపీ కార్యకర్తపై ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారని , దీనికి సదరు కార్యకర్త మనస్థాపం చేసి ఆత్మహత్యాయత్నం చేసుకోబోయాడని తెలిసి బాలకృష్ణ..ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని హెచ్చరించారు.

‘మొన్న నరసరావు పేటలో చిన్న సంఘటన జరిగింది. బాలకృష్ణ పాట వేశారంటూ వాళ్ల కార్యకర్తనే ఇబ్బంది పెట్టారు. అంతకంటే మూర్ఖుడు ఇంకెవరైనా ఉంటారా. యథా రాజ తథా ప్రజా. స్థాయి దిగజార్చుకున్న ఆ వ్యక్తి పేరు నేను తీయను. ఇంకోసారి ఇలాంటిది జరిగితే మాత్రం ఊరుకోను. నేను చిటికేస్తే, మూడో కన్నుతెరిచానంటే చూస్కోండి జాగ్రత్త. రాజకీయ నాయకుడిగా నాపైకి వస్తానంటే రండి. నేను రెడీ. కానీ, సినిమాల విషయానికి రావొద్దు. మీ పరిధిలో మీరు ఉండండి’ అని బాలకృష్ణ హెచ్చరించారు.

బాలకృష్ణ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. తనకు వార్నింగ్ ఇవ్వడానికి బాలకృష్ణ ఎవరని ప్రశ్నించారు. బాలకృష్ణ పెద్ద హీరో అయితే అది టీడీపీకి గొప్ప అని… తనకు కాదని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాలకృష్ణ కూడా ఒక మనిషే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. వాస్తవాలను తెలుసుకుని బాలకృష్ణ మాట్లాడాలని , సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో కూడా నటించడం కుదరదని అన్నారు.