పవన్ విషయంలో వైస్సార్సీపీ నేతలు మళ్లీ..మళ్లీ అదే తప్పు చేస్తున్నారు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే అధికార పార్టీ వైస్సార్సీపీ నేతలు భయపడుతున్నారా..? అంటే అవుననే అంటున్నారు జనసేన శ్రేణులు. పవన్ కళ్యాణ్ ఓ ఎమ్మెల్యే కాదు..ఓ ఎంపీ కాదు..ఆయన పార్టీ నుండి పట్టుమని పదిమంది ఎమ్మెల్యేలు కూడా లేరు. అలాంటి సింగిల్ మాన్ కు అధికార పార్టీ వణుకుతుందని అర్ధం అవుతుంది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేనాని దూకుడు పెంచారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా వైస్సార్సీపీ ని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సింగిల్ కాదు మిగతా పార్టీలను కలుపుకోనైనా సరే వైస్సార్సీపీ ని ఓడించాలని చూస్తున్నారు.

గత కొద్దీ రోజులుగా వారాహి యాత్ర తోనే కాదు సోషల్ మీడియా లోను వైస్సార్సీపీ పార్టీ ఫై వరుస ప్రశ్నలు సందిస్తూ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు పవన్. ప్రభుత్వ వైఫల్యాలను మాత్రం తెలుపుతూ వస్తున్నాడు. ముఖ్యంగా జగన్ సర్కార్ తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థలో లోపాలు జరుగుతున్నాయని ప్రశ్నించారు. వీటికి ప్రభుత్వం సమాధానం చెప్పకుండా ముఖ్యమంత్రి దగ్గరి నుండి మినిస్టర్స్ , ఎమ్మెల్యేలు , ఇతర నేతలు ఇలా అంత కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలను బయటకు తీస్తున్నారు. ఎంతసేపు పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని విమర్శిస్తున్నారు తప్ప..పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాదానాలు చెప్పడం లేదు.

పవన్ కళ్యాణ్ సైతం వ్యక్తిగత విషయాలు కాదు..నేను వేసిన ప్రశ్నలకు సమాదానాలు ఇవ్వండని అంటున్నారు. అలాగే మిగతా జనసేన శ్రేణులు , సోషల్ మీడియా లో నెటిజనులు అదే అడుగుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం తమ ధోరణి మారదు అన్నట్లు పదే పదే పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడుతూ మరింత పరువు తీసుకుంటున్నారు. ఇంకా ఎన్నాళ్లు ఇలా పవన్ పెళ్లిళ్ల గురించి ప్రశ్నిస్తారు..మీరు కూడా మూడు కాకపోతే పది పెళ్లిళ్లు చేసుకోవచ్చు కదా అని నెటిజన్లు కామెంట్స్ వేస్తున్నారు.