కేటీఆర్ బర్త్ డే సందర్బంగా టమాటాలు పంపిణి చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే

ఈరోజు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ బర్త్ డే సందర్బంగా ఉదయం నుండి రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ నేతలు , బిఆర్ఎస్ శ్రేణులు , అభిమానులు పెద్ద ఎత్తున పలు సేవ కార్యక్రమాలు చేసారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం కేకులు కట్ చేయడం , మొక్కలు నాటడం, దుస్తుల పంపిణి చేయడం , అన్నదానాలు , గోడగడియారాలు పంచడం వంటివి చేసారు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు మాత్రం టమాటాలు పంపిణి చేసి వార్తల్లో నిలిచారు.

గత కొద్దీ రోజులుగా దేశ వ్యాప్తంగా టమాటా కు ఎంతగా డిమాండ్ పెరిగిందో తెలియంది కాదు..రెండు నెలల క్రితం వరకు కేజీ రూ. 20 లకు లభించే టమాటా..ఆ తర్వాత కేజీ రూ. 120 నుండి రూ. 150 పలుకుతుంది. నెలరోజులుగా అలాగే ఉండడం తో సామాన్య ప్రజలు టమాటా వైపు చూడడమే మానేశారు. ఇలాంటి ఈ తరుణంలో నేడు (జులై 24వ తేదీన) మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు పేదలకు టమటాలను పంపిణీ చేసి వారిలో సంతోషాన్ని నింపారు.