ఎమ్మెల్సీల పేర్లు ఖరారు చేసిన వైఎస్‌ఆర్‌సిపి

అమరావతి: త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను వైఎస్‌ఆర్‌సిపి ప్రకటించింది. ఈ మేరకు సిఎం జగన్‌ అభ్యర్థులు ఖరారు చేశారు.చల్లా భగీరథరెడ్డి. శ్రీకాకుళం నుంచి దువ్వాడ శ్రీనివాస్‌, అనంతపురం నుంచి మహ్మద్ ఇక్బాల్, చిత్తూరు నుంచి బల్లి కల్యాణ్ చక్రవర్తి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా సి. రామచంద్రయ్య, విజయవాడ నుంచి కరీమున్నీసా పేర్లను వైఎస్‌ఆర్‌సిపి అధిష్టానం ఖరారు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటాలో మార్చి 29న ఖాళీ కానున్న ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది.

పదవీ కాలం ముగియనున్న ఎమ్మెల్సీల్లో గుండుమాల తిప్పేస్వామి, గుమ్మడి సంధ్యారాణి, వట్టికూటి వీర వెంకన్న చౌదరి(టీడీపీ), షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ ఉన్నారు. రాజ్యసభకు ఎన్నికైన పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ (వైఎస్‌ఆర్‌సిపి) ఇదివరకే మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మరణంతో ఆ స్థానం కూడా ఖాళీ అయింది. ఈ నెల 25న నోటిఫికేషన్‌ విడుదలైన నాటి నుంచి నామినేషన్లు మొదలవుతాయి. వీటి స్వీకరణకు తుది గడువు మార్చి 4. ఉపసంహరణ గడువు మార్చి 8. 15న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌… అదే రోజు సాయంత్రం 5గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/