ఎంజీఆర్‌ మెడికల్‌ వర్సిటీ స్నాతకోత్సవం.. ప్రసంగించనున్న మోడి

చెన్నై: నేడు ప్రధాని నరేంద్రమోడి తమిళనాడులోని డాక్టర్‌ ఎంజీఆర్‌ మెడికల్‌ విశ్వవిద్యాలయం 33వ స్నాతకోత్సవం కార్యాక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని 17,591 మంది విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్‌ పురోహిత్‌ హాజరుకానున్నారు.

మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి డాక్టర్ ఎంజీ రామచంద్రన్‌ యూనివర్సిటీలో మెడిసిన్, డెంటిస్ట్రీ, ఫార్మసీ, నర్సింగ్, ఆయుష్, ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, అలైడ్ హెల్త్ సైన్సెస్ విభాగాలుండగా.. 686 అనుబంధ సంస్థలు యూనివర్సిటీ పరిధిలో ఉన్నాయి. 41 వైద్య కళాశాలలు, 19 దంత, 48 ఆయుష్, 199 నర్సింగ్, 81 ఫార్మసీ కళాశాలలున్నాయి. అలాగే 11.50 గంటలకు ప్రధాని ఖేలో ఇండియా జాతీయ పోటీల ప్రారంభం సందర్భంగా ప్రారంభోత్సపన్యాసం చేయనున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/