రిషి సునాక్ రాజీనామా..కొత్త మంత్రిగా న‌దీమ్ జాహ‌వి

UK PM names Nadhim Zahawi as new finance minister after Rishi Sunak resigns

లండ‌న్‌: బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ ప్ర‌భుత్వంలో ఇద్ద‌రు మంత్రులు ఆర్థిక మంత్రి రిషి సునాక్‌, ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్‌లు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే రిషి సునాక్ స్థానంలో న‌దీమ్ జాహ‌వి మంత్రిగా నియ‌మితుడ‌య్యారు. బ‌గ్దాద్‌లో పుట్టిన ఈయ‌న‌ది కుర్దీష్ కుటుంబం.

కాగా, బోరిస్ నేతృత్వంలోని స‌ర్కార్ స‌రైన రీతిలో న‌డ‌వ‌డం లేద‌ని ఈ ఇద్ద‌రూ ఆరోపించారు. ప్ర‌భుత్వాన్ని వీడ‌డం బాధ‌గా ఉంద‌ని, కానీ ప్ర‌భుత్వాన్ని ఇలా కంటిన్యూ చేయ‌లేమ‌ని రిషి సునాక్ తెలిపారు. ప్ర‌భుత్వం స‌రైన విధానంలో న‌డ‌వాల‌ని, పోటీత‌త్వంతో ఉండాల‌ని ప్ర‌జ‌లు భావిస్తార‌ని, కానీ జ‌ర‌గ‌డం లేద‌న్నారు. బ‌హుశా ఇదే త‌న చివ‌రి మంత్రి ప‌ద‌వి అంటూ త‌న లేఖ‌లో తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/