ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన వైస్సార్సీపీ ఎమ్మెల్సీ లు వీరే

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ వైస్సార్సీపీ కి భారీ షాక్ ఇచ్చింది టీడీపీ. 7 స్థానాలకు 7 స్థానాలు గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేసిన వైస్సార్సీపీ..టీడీపీ షాక్ ఇచ్చింది. ఓ స్థానంలో పోటీ చేసి విజయం సాధించింది. టీడీపీ నుండి బరిలో నిల్చున్న పంచుమర్తి అనురాధ 23 ఓట్లు సాధించి విజయం డంఖా మోగించారు. వాస్తవానికి తనకు తగినంత బలం లేకపోయినా ఊహించని విధంగా ఘన విజయాన్ని సాధించారు.

మరోవైపు వైస్సార్సీపీ తరపున పెనుమత్స సత్యనారాయణ, మర్రి రాజశేఖర్, పోతుల సునీత, ఇజ్రాయెల్, ఏసురత్నం విజయం సాధించారు. అనురాధ విజయంతో వైస్సార్సీపీ అభ్యర్థులు కోలా గురువులు, జయమంగళలో ఒకరు ఓటమిపాలు కానున్నారు. ఎన్నికల్లో ఓటు వేసిన మొత్తం 175 మంది ఎమ్మెల్యేల ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. టీడీపీ అభ్యర్థి అనురాధకు అత్యధిక ఓట్లు పడటం గమనార్హం. ఆమెకు 23 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. టీడీపీకి ఉన్న సంఖ్యాబలం 19 మంది ఎమ్మెల్యేలే కావడం గమనార్హం.

ఇక వైస్సార్సీపీ అభ్యర్థులుగా గెలుపొందిన బొమ్మి ఇజ్రయెల్, ఏసురత్నం, పోతుల సునీత, సూర్యనారాయణ, మర్రి రాజశేఖర్ లకు ఒక్కొక్కరికి 22 ఓట్లు పడ్డాయి. జయమంగళం, కోలా గురువులకు 21 చొప్పున ఓట్లు పడ్డాయి. దీంతో, వీరిలో విజేత ఎవరనేది నిర్ణయించేందుకు రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు.