ఇరాక్‌పై మరో వైమానిక దాడి

సైన్యానికి చెందిన ఆరుగురి మృతి

New air strike
New air strike

బాగ్దాద్‌: ఇరాక్‌లోని బాగ్దాద్ విమానాశ్రయంపై శుక్రవారం రాకెట్ దాడులకు దిగిన అమెరికా వరుసగా రెండో రోజు కూడా వైమానిక దాడులకు పాల్పడింది. శనివారం తెల్లవారుజామున ఉత్తర బాగ్దాద్ నగరంపై రాకెట్లతో అమెరికా జరిపిన దాడిలో సైన్యానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇరాక్‌ మిలీషియా కమాండర్‌ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ దాడులకు ఎవరూ బాధ్యత ప్రకటించనప్పటికీ అమెరికానే ఈ పనికి పాల్పడిందని ఇరాక్ మీడియా పేర్కొంది.

కాగా, శుక్రవారం ఉదయం జరిగిన రాకెట్ దాడిలో ఇరాన్ ఉన్నతస్థాయి కమాండర్ జనరల్ ఖాసిం సులేమాని మృతి చెందారు. ఈ దాడిని అమెరికా ధ్రువీకరించింది. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకే ఈ దాడి జరిగినట్టు వైట్‌హౌస్ ప్రకటించింది. ఇరాక్‌లో ఉంటున్న అమెరికా పౌరులు వెంటనే వెనక్కి రావాలంటూ ఆ దేశ విదేశాంగ శాఖ పిలుపునిచ్చింది. మరోవైపు, సులేమాని మృతికి ప్రతీకారం తీర్చుకుంటామన్న ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్నాయి. ఈ దాడి తర్వాత పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు ఆవరించినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. మృతుల సంఖ్యపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/