గవర్నర్ తమిళసై ని కలిసిన తీన్మార్ మల్లన్న భార్య

జర్నలిస్టు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న భార్య మమతా..ఈరోజు రాజ్ భవన్ లో గవర్నర్ తమిళసై ని కలిశారు. జర్నలిస్టు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నను మంగళవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. క్యూ న్యూస్ సిబ్బంది తనను నిర్బంధించి దాడి చేశారని సాయికరణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు మల్లన్నపై ఐపీసీ సెక్షన్లు 148, 307, 342, 506, 384, 109, r/w 149 కింద కేసులు నమోదు నమోదు చేసారు. ఈ క్రమంలో కోర్ట్ మల్లన్న తో పాటు నలుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం తీన్మార్ మల్లన్నను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.

ఈ క్రమంలో మల్లన్న అరెస్ట్.. పోలీసుల తీరుపై రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి కంప్లయింట్ చేశారు మల్లన్న భార్య. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న బిడ్డను చూసి చలించిపోయారు గవర్నర్. ఏమైందీ అంటూ పాపను దగ్గరకు తీసుకున్నారు. ఒడిలో పెట్టుకుని పాపను పరీక్షించారు. పాపకు ఉన్న అనారోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మల్లన్న లేకుండా బిడ్డ ఉండలేదని.. నాన్న నాన్న అంటూ రోజూ కలవరిస్తుందని.. బిడ్డను చూడకుండా మల్లన్న కూడా ఉండలేడంటూ గవర్నర్ తమిళిసై దృష్టికి తీసుకెళ్లారు మల్లన్న భార్య మమత. పాప పరిస్థితి చూసి కూడా పోలీసులు కనికరించలేదంటూ వివరించారు. మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేయడంతో అతని కూతురు అప్పుడు కూడా తండ్రిపై బెంగ పెట్టుకుంది. తీవ్ర అనారోగ్యానికి గురై ..ఐసీయూలో చికిత్స పొందింది. మల్లన్న కూతురు ఆరోగ్యం ముందు నుంచీ సరిగా ఉండదు. అయితే మల్లన్న అరెస్టు తర్వాత…ఆ చిన్నారి బాగా బెంగ పెట్టుకుంది. తన తండ్రి లేకపోవడంతో అన్నం తినడం మానేసింది.