షర్మిల అరెస్ట్..పరామర్శకు వచ్చిన విజయమ్మను అడ్డుకున్న పోలీసులు

షర్మిలను అరెస్ట్ చేయడం, పీఎస్ కు తీసుకెళ్లడమే పోలీసులకు తెలుసన్న విజయమ్మ

ys-vijayamma-arguments-with-police

హైదరాబాద్: విధుల్లో ఉన్న ఎస్సై, కానిస్టేబుల్ ను తోసేశారనే ఆరోపణలో వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. లోటస్ పాండ్ నుంచి జూబ్లీహిల్స్ పీఎస్ కు తరలించారు. ఆమెపై పోలీసులకు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తన కూతురును పరామర్శించేందుకు పోలీస్ స్టేషన్ వద్దకు విజయమ్మ వచ్చారు. అయితే విజయమ్మను పోలీసులు స్టేషన్ లోపలకు అనుమతించలేదు. ఆమెను రోడ్డు పైనే ఆపేశారు. ఈ క్రమంలో పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు.

తన కూతురును ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. తనను స్టేషన్ లోపలకు ఎందుకు అనుమతించడం లేదని నిలదీశారు. షర్మిలను అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడం, షర్మిల గన్ మొన్లను కొట్టడమే పోలీసులకు చేతనవుతుందని విజయమ్మ మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్లు ఎందుకు లీక్ అయ్యాయని ప్రశ్నించేందుకు సిట్ కార్యాలయానికి వెళ్తున్న షర్మిలను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. షర్మిలను కలిసేంత వరకు తాను ఇక్కడ నుంచి కదలనని చెప్పారు.