నారాయణగూడ సీఐ శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్

హైదరాబాద్: హైదరాబాద్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాస్ రెడ్డి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంగా సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీచేశారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో హుక్కా పార్లర్లు యథేచ్ఛగా నడుస్తున్నప్పటికీ సీఐ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నాడని ఆరోపణలున్నాయి. అయితే ఇటీవల టాస్క్ ఫోర్స్ రైడ్స్‌లో సీఐ శ్రీనివాస్ రెడ్డి తేటతెల్లం కావడంతో ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు.