ఫిలిం ఛాంబర్ లో తారకరత్న భౌతికకాయం ..

తారకరత్న భౌతికకాయాన్ని ఫిలిం ఛాంబర్ కు తరలించారు. శనివారం తారకరత్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత నెలలో ఈయన గుండెపోటుకు గురికావడం తో బెంగుళూర్ లోని నారాయణ హృదయాల హాస్పటల్ కు తరలించారు. అప్పటి నుండి కోమాలోనే ఉండిపోయారు. విదేశీ డాక్టర్స్ సైతం తారకరత్న ఆరోగ్యం కుదుటపడేలా తీవ్రంగా శ్రమించారు కానీ కుదరలేదు. దాదాపు 24 రోజులపాటు చికిత్స అందించారు. కానీ తారకరత్న ను బ్రతికించలేకపోయారు.

చివరకు ఫిబ్రవరి 18 మహాశివరాత్రి రోజున కన్నుమూశారు. ఆ తర్వాత బెంగుళూర్ నుండి ఆయన భౌతికాయాన్ని హైదరాబాద్ లోని మోకిలాలోని తారకరత్న నివాసానికి తరలించారు. తారకరత్న ను కడసారి చూసేందుకు సినీ , రాజకీయ ప్రముఖులు, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళ్లు అర్పించారు. కొద్దిసేపటి క్రితం ఫ్రీజర్‌ నుంచి తారకరత్న దేహాన్ని బయటకు తీసి ఆయన కుమారుడి చేతుల మీదుగా ప్రక్రియ పూర్తి చేశారు. ఇంటినుంచి తారకరత్న భౌతికకాయాన్ని ఫిలం ఛాంబర్ కు తరలిస్తున్నారు. కాసపేట్లో ఫిలిం ఛాంబర్ కు ఆయన భౌతికకాయం చేరుకోనుంది. అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్ లో ఉంచనున్నారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మహా ప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరపనున్నారు.

ఇక తారకరత్న మరణంతో ఆయన భార్య, పిల్లలు ఒంటరి వారైపోయారు. దీంతో వారి విషయంలో నందమూరి బాలకృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నారట. తారకరత్న ముగ్గురు పిల్లల బాధ్యత తాను తీసుకుంటానని.. తారక్ కుటుంబానికి నిత్యం అండగా ఉండానని భరోసా ఇచ్చారట.