మరికాసేపట్లో షర్మిలతో వివేకానందరెడ్డి కూతురు సునీత భేటీ

రోజు రోజుకు ఏపీ రాజకీయాలు మరింత వేడిపెంచుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీలు తమ అభ్యర్థులపై కసరత్తులు చేస్తూ..ప్రజల్లోకి వెళ్తున్నారు. వరుస సభలు , సమావేశాలు జరుపుతూ యాక్టివ్ అవుతున్నారు. అలాగే ఇతర పార్టీల నేతలను లాక్కునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇదంతా ఒకెత్తయితే..వైస్సార్ ఫ్యామిలీ రాజకీయాలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి.

మొన్నటి వరకు జగన్ మాత్రమే అనుకోగా..ఇప్పుడు కాంగ్రెస్ పగ్గాలు షర్మిల అందుకోవడం తో వైస్సార్ ఫ్యామిలీ లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఏపీసీసీ పదవి దక్కించుకోవడమే ఆలస్యం..షర్మిల జగన్ ఫై విమర్శల దాడిచేస్తూ నానా హడావిడి చేస్తుంది. ఇక ఇప్పుడు వివేకానందరెడ్డి కూతురు సునీత..మరికాసేపట్లో షర్మిల తో భేటీ కాబోతుండడం మరింత ఆసక్తి రేపుతోంది. సునీత రాజకీయ ప్రవేశంపై చర్చ జరుగుతుందని సమాచారం. ప్రస్తుతం సునీత తన తండ్రి హత్య కేసుపై ఆమె న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ కేసులో ఎంపీ అవినాశ్, ఆయన తండ్రి భాస్కరరెడ్డితో పాటు పలువురిని సీబీఐ నిందితులుగా పేర్కొన్న విషయం తెలిసిందే.