రేపు గజ్వేల్ నియోజక వర్గంలో పర్యటించనున్న వైఎస్‌ షర్మిల

ys-sharmila-to-visit-gajwel constituency- tomorrow

హైదరాబాద్‌ః వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల ఉదయం 10 గంటలకు గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్ పూర్ మండలం తీగల్ గ్రామానికి చేరుకోనుంది. ఇటీవల దళిత బంధు పథకం అర్హులకు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేసిన తీగుల్ గ్రామప్రజలను షర్మిల కలిసి వివరాలను అడిగి తెలుసుకోనున్నారు.

తెలంగాణలో అందరికీ మేలు చేసేందుకు వైఎస్‌ఆర్‌ ఎంతో కృషి చేశారు. సొసైటీలో భూముల కేసు సుప్రీంకోర్టులో గెలిచినా ఇండ్ల స్తలాలు ఇవ్వడానికి చిత్తశఉద్ది లేదన్నారు. ఇటీవల జర్నలిస్టులను సైంటీస్టులతో పోల్చిన కెసిఆర్ జర్నలిస్టులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు అసలు ఎంత మందికి దళిత బంధు అందింది ? దళిత బంధుతో ఎవరు లబ్ది పొందుతున్నారనే వివరాలను షర్మిల రేపు మీడియాకు వివరించనున్నారు.