తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.ఏపీలో మూడు, తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాల కోసం నవంబర్ 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 29న పోలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణలో ఆకుల లలిత, ఫరీదుద్దీన్, గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి పదవీకాలం జూన్ 3న పూర్తైంది. ఏపీలో చిన్నగోవింద్ రెడ్డి, మహ్మద్ షరీఫ్, సోము వీర్రాజు పదవీకాలం మే 31వ తేదీతో పూర్తైంది. కరోనా రెండో దశ కారణంగా గతంలో ఎన్నికల నిర్వహణను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. తాజాగా ఎన్నికల నిర్వహణకు నిర్ణయం తీసుకుంది.

నవంబర్ 9 నుంచి 16 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 17న పరిశీలన… నవంబర్ 22 తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. నవంబర్ 29వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు ఐదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/