బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ ను టార్గెట్ చేసిన వైస్ షర్మిల

వైస్ షర్మిల ఈ పార్టీ ఆ పార్టీ అనే కాదు అన్ని పార్టీల నేతల ఫై విరుచుకుపడుతుంది. మొన్నటి వరకు కేవలం టిఆర్ఎస్ , కాంగ్రెస్ నేతలను మాత్రమే టార్గెట్ గా చేసుకుందని , వారిపై మాత్రమే ఆరోపణలు చేస్తుందని అంత మాట్లాడుకుంటూ వచ్చారు. కానీ తాజాగా ఈమె దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ ఫై పలు ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది.

దుబ్బాక నియోజకవర్గంలో షర్మిల మాట్లాడుతూ.. దుబ్బా క ప్రజల చెవిలో కేసీఆర్ గత కొన్నేళ్లుగా పూలు పెడితే.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు ప్రజల చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టారంటూ విమర్శించారు. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రఘునందనరావు విఫలమయ్యారన్నారు. మల్లన్న సాగర్ బాధితులకు ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇచ్చిన హామీ నెరవేర్చారా అంటూ ప్రశ్నించారు. 11 గ్రామాల ప్రజలకు అన్యాయం జరిగిందని తానను ఎమ్మెల్యేగా గెలిపిస్తే న్యాయం చేస్తానని చెప్పిన రఘునందనరావు ఏమి న్యాయం చేశారంటూ ప్రశ్నించారు.

రెండింతల పరిహారం ఇప్పిస్తానని చెప్పి, గెలిచిన తర్వాత ఆ హామీని మర్చిపోయారంటూ ఆరోపించారు వైఎస్.షర్మిల. పరిహారం ఇప్పించక పోతే 6 నెలల్లో రాజీనామా చేస్తానని చెప్పిన రఘునందనరావు పరిహారం ఇప్పటివరకు ఇప్పించలేదని, రాజీనామా కూడా చేయలేదని అన్నారు. ప్రతి రైతుకు కాడేద్దులు ఇప్పిస్తా అని ఇచ్చిన హామీ ఏమయ్యింది.. ఒక్కరికైనా కాడెద్దులు ఇచ్చారా అని షర్మిల ప్రశ్నించారు.