అల్లు ఫ్యామిలీతో గొడవలపై క్లారిటీ ఇచ్చిన మెగా బ్రదర్

ఇండస్ట్రీ లో అల్లు , మెగా ఫ్యామిలీలది ప్రత్యేకమైంది. ఇరు ఫ్యామిలీ ల నుండి దాదాపు పదిమంది వరకు హీరోలుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి రాణిస్తున్నారు. కాగా గత కొద్దీ నెలలుగా అల్లు – మెగా ఫ్యామిలీ ల మధ్య విభేదాలు నడుస్తున్నాయనే వార్తలు చక్కర్లు కొడుతూ వస్తున్నాయి. ఈ వార్తలపై అల్లు అరవింద్ , మెగా స్టార్ చిరంజీవి స్పందించినప్పటికీ, ఆ వార్తలకు మాత్రం ఫుల్ స్టాప్ పడలేదు. అలాగే ప్రచారం అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో మరోసారి ఈ వార్తల ఫై మెగా బ్రదర్ నాగబాబు క్లారిటీ ఇచ్చారు.

ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..సదరు యాంకర్ అల్లు ఫ్యామిలీతో గొడవలు ఉన్నాయా అని అడుగగా..” అల్లు అరవింద్ గారిది.. చిరంజీవి గారిది సుదీర్ఘమైన ప్రయాణం.. ఈ ప్రయాణంలో ఒకటి రెండు మాటలు అటు ఇటు ఉండవచ్చు.. అంతెందుకు నాకు పవన్ కళ్యాణ్ కి మధ్య కూడా అలాంటి చిన్న చిన్న మాటలు ఉంటాయి. అయితే ఒక ఫ్యామిలీగా చూస్తే అన్నయ్యగారు, అరవింద్ గారు కలిసే ఉంటారు. బయట వినిపించేవన్నీ కేవలం పుకార్లు మాత్రమే. పవన్ కళ్యాణ్ , బన్నీ, రామ్ చరణ్, వరుణ్ తేజ్ ఇలా అందరూ కూడా ఎవరి ఐడెంటిటీ కోసం వాళ్లు ప్రయత్నిస్తున్నారు. కానీ అందరూ కూడా కలిసే ఉంటారు . ఒక రకంగా చెప్పాలి అంటే ఎవరి ప్రయాణం వారిది. ఇంతకుముందు చెప్పినట్లు అభిప్రాయాలలో ఒకటి రెండు కుదరకపోవచ్చు కానీ దానినే సమస్యగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ” క్లారిటీ ఇచ్చారు.