నేడు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నిక పోలింగ్‌

congress-party-president-elections-polling-starts

న్యూఢిల్లీః నేడు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నిక పోలిం‌గ్‌కు రంగం సిద్ధమైంది. 24 ఏండ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడి ఎంపిక కోసం సోమ‌వారం పోలింగ్‌ జరుగనుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్‌ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా మొత్తం 9,100కు పైగా పార్టీ సభ్యులు పోలింగ్‌లో పాల్గొ‌న‌ను‌న్నారు. రహస్య బ్యాలెట్‌ విధా‌నంలో జరు‌గ‌నున్న ఈ ఎన్నిక ఫలి‌తాన్ని ఈ నెల 19న వెల్లడించ‌ను‌న్నారు. ఈ ఎన్ని‌కలో మల్లి‌కా‌ర్జున్‌ ఖర్గే, శశి‌థ‌రూర్‌ అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు.

కాగా, ఎన్నికకు సంబంధించి ఏఐసీసీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. భారత్‌ జోడో యాత్రలో ఉన్న పార్టీ సీనియర్‌ నేత రాహు‌ల్‌‌గాంధీ.. కర్ణా‌ట‌క‌లోని బళ్లారి జిల్లా సంగ‌న‌కల్లు క్యాంపులో తన ఓటు హక్కును విని‌యో‌గిం‌చు‌కొం‌టారు. ఇక రాష్ట్రంలో 238 మంది తమ ఓట్లు హక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్రానికి రిటర్నింగ్‌ అధికారిగా కేరళకు చెందిన రాజమోహన్‌ ఉన్నితన్‌ వ్యవహరించనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/