క‌డప జిల్లాలో ష‌ర్మిల ఎన్నిక‌ల ప్ర‌చారం..

Jagan is blocking his authority and protecting many murderers: Sharmila

ఎన్నికల ప్రచారంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైస్ షర్మిల దూకుడు కనపరుస్తుంది. తమ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొంటూ అధికార పార్టీ వైసీపీ ఫై , బిజెపి ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈరోజు కడప జిల్లాలోని పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు నియోజకవర్గంలో ఆమె పర్యటన సాగనుంది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా వైఎస్ షర్మిల ప్రచారం చేయనున్నారు. కడప జిల్లాలోనే న్యాయయాత్ర పేరిట గత కొద్దిరోజులుగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను పర్యటించిన షర్మిల వారం రోజుల పాటు కడప పార్లమెంటు పరిధిలోనే పర్యటించాలని నిర్ణయించారు.

కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తాను పోటీ చేస్తుండటంతో షర్మిల ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. గెలుపే లక్ష్యంగా ఆమె పర్యటన సాగనుంది. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా విరుచుకుపడుతున్నారు. వైఎస్ హయాంలో జరిగిన కార్యక్రమాలు..జగన్ పాలనలో వైఫల్యాలను వివరిస్తున్నారు. తాను పులి బిడ్డనని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్‌కు జగన్ వారసుడు ఎలా అవుతాడని షర్మిల ప్రశ్నించారు. వైఎస్ఆర్ ఆశయాలను ఒక్కటి అమలు చేశారా అని నిలదీసారు. అవినాశ్ ను అరెస్ట్ చేయకుండా కాపాడింది ఎవరని షర్మిల ప్రశ్నించారు.

తనను కడప ఎంపీగా గెలిపిస్తే కేంద్రంలో మంత్రిని అవుతానని షర్మిల అన్నారు. ప్రత్యేక హోదా సాధిస్తానని స్పష్టం చేశారు. అధికారంలో ఉండి రైతులను అప్పుల పాలు చేశాడని విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ హయాంలో వ్యవసాయం పండగని గుర్తు చేసారు. నేడు రాష్ట్రంలో అప్పు లేని రైతు లేడని చెప్పుకొచ్చారు. పంట నష్ట పరిహారం అని మోసం చేశాడని మండిపడ్డారు.