‘ఆదిపురుష్’ సెన్సార్ పూర్తి

ప్రభాస్ – కృతి సనన్ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రనౌత్ డైరెక్షన్లో ఆదిపురుష్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సాహో, రాధేశ్యామ్ సినిమాల తర్వాత రాబోతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సైఫ్‌ అలీఖాన్‌ లంకాధిపతి రావణాసురుడుగా కనిపిస్తుండగా రాముడి గా ప్రభాస్ , సీతగా కృతి కనిపించనున్నారు. టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను నిర్మించాయి. జూన్ 16 న పలు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ఈ చిత్ర యూనిట్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసారు.

హిందీ సెన్సార్ బోర్డు ఈ సినిమాకు క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చింది. పిల్లలు, పెద్దలు… అందరూ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాను చూడొచ్చు అన్నమాట. సినిమా రన్ టైమ్ ఒక్క నిమిషం తక్కువ మూడు గంటలు వచ్చింది. కంటెంట్ ఎంగేజింగ్‌గా ఉంటే… రన్ టైమ్ ఎక్కువైనా సరే ప్రేక్షకులు సినిమా చూస్తున్నారు. అందువల్ల, ‘ఆదిపురుష్’ చిత్ర బృందం మూడు గంటల సినిమాను చూపించడానికి మొగ్గు చూపించినట్టు ఉంది.

సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు దర్శక, నిర్మాతలను ప్రశంసించారని బీ టౌన్ వర్గాలు అంటున్నారు. ఈ తరం ప్రేక్షకులు సైతం హర్షించేలా సినిమా తీశారని చెప్పారట. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాల్లో ప్రభాస్ నటన, ఎమోషన్స్ అన్ని వర్గాలను ఆకట్టుకోవడం ఖాయమని యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.