సీఎం జగన్ ఫై దాడి చేసినట్లు ఒప్పుకున్న యువకుడు

Stone attack on Jagan .. If the accused are caught, Rs. 2 lakhs reward!

ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత , సీఎం జగన్ గత కొద్దీ రోజులుగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం విజయవాడ లో యాత్ర చేస్తుండగా..గుర్తు తెలియని వ్యక్తి జగన్ ఫై రాయి తో దాడి చేయడం తో..ఆయన కనుబొమ్మ పైన గాయం అయ్యింది. ఈ దాడి ఫై అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ వస్తుంది.

ఈ దాడి చేసింది టిడిపి వల్లే అని వైసీపీ..మీరే దాడి చేయించుకొని మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని టిడిపి..ఇలా ఇరువురు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక ఈ దాడి ఫై సిట్ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టి నలుగుర్ని అదుపులోకి తీసుకొని విచారించగా..సతీష్ అనే మైనర్ యువకుడు ఈ దాడి తానే చేసినట్లు ఒప్పుకున్నాడు. మరి ఈ దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది..? ఎవరైనా చేయమన్నారా..? అనేకోణం లో దర్యాప్తు చేస్తున్నారు.