నేడు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ ప్రమాణం

లక్నో: నేడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగీ ఆదిత్యనాథ్‌ రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన యూపీ ఎన్నికల్లో యోగి నేతృత్వంలోని బీజేపీ సంచలన విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఐదేళ్లపాటు పూర్తికాలం సీఎం పదవిలో కొనసాగిన మొదటి వ్యక్తిగా, పార్టీని వరుసగా రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చిన నేతగా రికార్డుల్లో నిలిచారు. గతంతో పాలిస్తే ఈ సారికొద్దిగా సీట్ల సంఖ్య తగ్గినప్పటికీ.. యూపీ ప్రజలు యోగి నాయకత్వాన్నే కొరుకున్నారు.

కాగా, గురువారం సాయంత్రం లక్నోలో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆదిత్యనాథ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో శుక్రవారం సీఎంగా వరుసగా రెండోసారి పట్టాభిషేకం చేయనున్నారు. సీఎం ప్రమాణ స్వీకార వేడుకకు లక్నోలోని ఎకానా స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఈకార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌శా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆపార్టీ అగ్రనాయకులు హాజరుకానున్నారు. రాజకీయ నాయకులతోపాటు వ్యాపార వేత్తలు, సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/