మహబూబాబాద్ జిల్లాలో ఘోరం..పగబట్టిన పాము..3 నెలల చిన్నారిని కూడా వదిలిపెట్టలేదు

తాచుపాములు పగబడతాయంటే చాలామంది నమ్మరు. కానీ ఇది నిజమని మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఘటన తో రుజువయ్యింది. నీలిత్రాచు పాము..ఓ కుటుంబం ఫై పగబట్టి..ఆ కుటుంబం మొత్తాన్ని కాటేసింది.

వివరాల్లోకి వెళ్తే..

మహబూబాబాద్ జిల్లా పరిధిలోని శనిగపురంలో క్రాంతి, మమత దంపతులు పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో పొలం పనులు చేసుకుంటుండగా ఆ దంపతులపై పాము పగపట్టింది. రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో క్రాంతి, మమత దంపతులతో పాటు వారి 3 నెలల చిన్నారిని పాము కాటేసింది. స్థానికులు పామును పట్టుకుని చంపేసి, పాముకాటుకు గురైన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోగా.. ప్రాణాపాయ స్థితిలో చిన్నారి తల్లితండ్రులు చికిత్స పొందుతున్నారు. కాటేసిన పాము విషపూరితమైన నీలిత్రాచని స్థానికులు తెలిపారు.‌ పాముకాటుతో చిన్నారి ప్రాణాలు కోల్పోవడం, తల్లిదండ్రులు ఆసుపత్రి పాలు కావడంతో కుటుంబ సభ్యులను విషాదం లో నింపింది.