ప్రీతీ ని ర్యాగింగ్ చేసినట్లు ఒప్పుకున్నా సైఫ్

Yes.. I raged!.. Saif admitted in the police investigation

ర్యాగింగ్ భూతం ఎంతో భవిష్యత్ ఉన్న యువతిని చంపేసింది. డాక్టర్ అయ్యి..ఎంతోమందికి సేవ చేయాలనీ కలలు కన్నాఆ యువతీ సీనియర్ వేదింపులు తట్టుకోలేక ప్రాణాలు విడిచింది. నిమ్స్‌లో చికిత్స పొందుతూ గత నెల 26న డాక్టర్ ప్రీతి కన్నుమూసింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయ్యింది. ప్రస్తుతం ప్రీతి చావుకు కారణమైన సైఫ్ ను పోలీసులు కోర్ట్ లో హాజరుపరచగా…అసలు నిజం ఒప్పుకున్నాడు. మొదట్లో అదుపుచేసి విచారించగా..ప్రీతి ని వేదించలేదని , సలహాలు , సూచనలు మాత్రమే ఇచ్చానని తెలిపిన సైఫ్..పోలీసులు అతడి వాట్సాప్ చాటింగులు బయటకు తీసి సైఫ్ ఉద్దేశపూర్వకంగానే ర్యాగింగ్‌కు పాల్పడినట్టు నిర్ధారించారు.

ఆ తర్వాత అతడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఆ తర్వాత నాలుగు రోజులపాటు జరిపిన విచారణలో ఆధారాలు చూపించి సైఫ్‌ను ప్రశ్నించడంతో ర్యాగింగ్ చేయడం నిజమేనని అంగీకరించినట్టు తెలుస్తోంది. కస్టడీ ముగిసిన తర్వాత ఈ నెల 6న సైఫ్‌ను కోర్టులో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించిన కన్ఫెషన్ రిపోర్టులో ర్యాగింగ్‌ను సైఫ్ అంగీకరించాడని తెలిపారు.